చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదేళ్ల జైలు శిక్ష ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డ నిందితుడికి తిరుపతి రెడ్ శాండిల్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2018 జూన్ లో వెదురుకుప్పం మండలం పచ్చికాపలం - తిరుపతి రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో సత్యవేడు మండలానికి చెందిన మహేంద్ర పట్టుపడ్డాడు. నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష విధించారు.