ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఆదివారం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. ఓ ప్రైవేట్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి ఐదు రోజులపాటు విద్యార్థులు కాలేజీ యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నిమజ్జనం కార్యక్రమాలలో భాగంగా అంగరంగ వైభవంగా గణేష్ ఊరేగింపు నిర్వహించి విద్యార్థులు కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో వీడ్కోలు పలికారు. పోలీసులు ఎటువంటి అవాంఛనమైన సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.