ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆర్వో లు ఏఆర్ఓ లకు స్టేజ్ వన్ స్టేజ్ టు ఎన్నికల నిర్వహణపై శుక్రవారం మూడు గంటల సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్ర గుట్ట వద్ద గల బాలికల గురుకుల పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు.