తిరుమలలో కొత్తగా నిర్మించిన పిఎసి 5 యాత్రికుల సముదాయాన్ని టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు మొదటిసారి శనివారం పరిశీలించారు దీని నిర్మాణానికి 2018లో టీటీడీ బోర్డు ఆమోదించింది 2500 మందికి వసతి కల్పించేలా అన్ని సదుపాయాలు సిద్ధం చేసింది బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ తెలిపారు చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక గది 1400 మందికి అన్న ప్రసాద వసతి ప్రథమ చికిత్స కేంద్రం అన్ని ఇందులో అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.