జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయమును శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. ఎస్. లత వెళ్లి పరిశీలించారు. ఈసందర్బంగా భూ భారతి రెవిన్యూ సదస్సుల దరఖాస్తులు మరియు సాధాబైనామా దరఖాస్తులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినారు. అనంతరం సారంగాపూర్ మండలం కేంద్రంలోని కస్తూరిబా వసతి గృహమును సందర్శించినారు.