చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం సురేంద్ర నగర్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని తిరుమల కుప్పం వేపగుంట గ్రామాలకు చెందిన ప్రజలు చిత్తూరు గనుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ను అక్రమంగా తరలిస్తున్నారని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారి కోరారు అక్రమ క్వారీపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.