వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాలను జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్ మరియు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు బోయ రామకృష్ణ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ' మన ఊరు మనబడి ' పథకం క్రింద పాఠశాలకు నూతన తరగతుల కొత్త భవనం నిధులు మంజూరు కావడం జరిగింది. ప్రాథమిక పాఠశాల ఎంత దారుణంగా ఉందంటే పాత గోడల మీద కొత్త స్లాబును నిర్మిస్తున్నారు. పాత గోడల మీద కొత్త స్లాబును నిర్మిస్తే భవిష్యత్తులో క్రుంగి కూలడం జరుగుతుంది. చిన్న పిల్లల ప్రాణాలు ఎందుకు పణంగా పెడుతున్నారని అన్నారు.