సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజాసమస్య ల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం డిఆర్ఓ మధుసూదన్ రావు తో కలిసి రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, ఏడి సర్వేయర్ భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తో కలిసి మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలోని, రాయచోటిలోని, శ్రీ శివ నర్సింగ్ కాలేజ్ నందు ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి శ్రీ దాసరి నాగార్జున గారు ఒక ప్రకటనలో తెలిపారు.