కంబదూరు మండల కేంద్రానికి చెందిన సాయి చందన డీఎస్సీ ఫలితాలు అత్యంత ప్రతిభ కనబరిచింది. ఏకంగా మూడు ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించింది. సాయి చందన టీజీటీ బయాలజీ జోన్ -4 లో 81.79 మార్కులు సాధించి ఐదవ ర్యాంకు కైవసం చేసుకుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ లో 83.13 మార్కులుతో జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అంతేకాకుండా ఎస్జీటీలో 84.54 మార్కులతో జిల్లా స్థాయిలో 84వ ర్యాంకు సాధించింది. ఏకంగా మూడు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన సాయి చందనను ఆదివారం స్నేహితులు, స్నేహితులు అభినందించారు.