సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని వట్పల్లి మండల కేంద్రంలో శనివారం రోడ్లు బాగు చేయాలని బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ అల్లాదుర్గం చౌరస్తా నుండి మెటల్ కుంట వారికి రోడ్డు పూర్తిగా అద్వానంగా తయారైందని ఎక్కడ చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయని వారు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డును బాగు చేయాలని వారి డిమాండ్ చేశారు.లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.