వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గురువారం చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు గురువారం రాత్రి ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన నేతలను ఉద్దేశించి బొత్స మాట్లాడుతూ "మీకు పౌరుషం లేదా, మీరు ఉప్పు కారం తినరా" అని ప్రశ్నించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బొలిశెట్టి స్పందించారు.