కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ లోని విజయనగర్ కాలనీకి చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ తన మోటార్ సైకిల్ స్ప్లెండర్ ప్లేస్ బైక్ ను తన ఇంటి ముందు పార్క్ చేసి మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి అట్టి దానిని గుర్తు తెలియని దొంగలు దొంగలించారని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా బుధవారం సాయంత్రం బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై ఆటోనగర్ వైపు వెళ్ళుతు, పోలీస్ వారిని చూసి మోటార్ సైకిల్ ని తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.