మహాలయ పౌర్ణమి (మాలపున్నం) సందర్భాంగా ఆదివారం గుత్తి, గుత్తి ఆర్ఎస్ లతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా మటన్ కోసం జనాలు కిక్కిరిశారు. ముఖ్యంగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మటన్ దుకాణాలు మాంసం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. మటన్ కిలో రూ.750 విక్రయిస్తున్నారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి మటన్ దుకాణాలు వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ కంటే మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.