నల్లగొండ జిల్లా: యూరియా కోసం తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చామని మహిళా రైతులు సోమవారం తెలిపారు. నకిరేకల్ పిఎసిఎస్ కేంద్రం వద్ద వారు మాట్లాడుతూ ఒరిస్సాగు చేశామని అత్యవసర సమయంలో యూరియా లభించకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని ,ప్రభుత్వ స్పందించి రైతులకు సరిపడా యూరియాలో అందించాలని వేడుకున్నారు.