భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రూ. 4.62 లక్షలు విలువ చేసే చెక్కులను ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. తాళ్లజ్జుల వెంకట సత్య శ్రీ రామ్మూర్తికి రూ. 2 లక్షలు, కర్రి ఎర్రిబాబుకు రూ. 90 వేలు, మహ్మద్ గౌస్ షరీఫ్ కు రూ. 51 వేలు, అనారోగ్యంతో మృతి చెందిన కోరాడ అప్పలరాజు కుటుంబానికి రూ. 51 వేలు, కడియంశెట్టి అన్నపూర్ణ కుటుంబానికి రూ. 40 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లొడగల అప్పారావు పాల్గొన్నారు.