భూపాలపల్లిలోని రాజీవ్ నగర్కు చెందిన మహమ్మద్ బాసిత్ (20) అనే యువకుడిని ఈనెల 3న బబ్లు, ప్రశాంత్, కుషాల్ మరికొందరు కిడ్నాప్ చేశారు. తల్లి సబియా ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న భూపాలపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడారం నుంచి తాడ్వాయి మధ్య రోడ్డు పక్కన ఉన్న గుట్టపై చేతులు కట్టివేసి చంపి కాల్చినట్లు పోలీసులు నిన్న శుక్రవారం రోజున సాయంత్రం గుర్తించారు. భూపాలపల్లి సీఐ నరేశ్, ఎస్సై సాంబమూర్తి పంచనామ చేశారు.