అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బళ్లారి సమీపంలోని గంగానహళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జిల్లాలోని కమలాపురం కు చెందిన పి సుధాకర్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రతుకుతెరువు కోసం బళ్లారి కు వెళ్లి జీవితం సాగిస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.