ఆస్తి కోసం కన్న తల్లినే చంపడానికి యత్నించిన కొడుకు భీమయ్యను తిర్యాణి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లి పులికాంత సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే ఆమె అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. ఈ మేరకు తీర్యాణి పోలీస్ స్టేషన్ లో కొడుకుపై తల్లి పిర్యాదు చేయడంతో అతనికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.