ముఖ్యమంత్రి పర్యటనకు ప్రకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.ఈనెల 4వ తేదీ గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద బాధిత లింగంపేట మండలం లింగంపల్లి కుర్డు ఆర్ అండ్ బి వంతెన, బుడిగిడా గ్రామంలో ఇసుక మేట వేసిన వరి పొలాలు, కామారెడ్డి పట్టణంలో జీఆర్ కాలనీ వద్ద దెబ్బతిన్న రోడ్డు, మునిగిపోయిన ఇండ్ల పరిశీలన బాధితులను కలుస్తారని అనంతరం కలెక్టర్ లో వరదలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఉన్నట్లు తెలిపారు.