రామాపురం మండలం నల్లగుట్టపల్లె గ్రామం కర్ణపువాండ్లపల్లె లో గురువారం నిర్వహించిన వినాయక నిమ్మజ్జన మహోత్సవంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి కరుణా కటాక్షాలతో వర్షాలు సంవృద్దిగా కురిసి రైతులు, ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషం గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.వినాయక చవితి ఉత్సవాలు, నిమ్మజ్జన కార్యక్రమాలను భక్తి శ్రద్దలతో, శాంతి యుతంగా, జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన యువతను కోరారు.