ఇంటికి తాళం వేసి విహారయాత్రలకు కుటుంబ అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకు వెళ్లకుండా తిరుపతి జిల్లా పోలీసులు ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాలకు పని చెబుతున్నారు. ఈ కెమెరాలను బిగించడం వలన దొంగలు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం ఇస్తుందని దోపిడీ కాకుండా నిరోధించవచ్చని కాబట్టి ప్రజలంతా ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలని వీటిని ఉచితంగా పోలీసు వారు అందజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు.