కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ప్రతి గ్రామం, పట్టణాల వీదుల్లో మండపాల్లో కొలువుదీరిన లంభోదరుని నామస్మరణంతో వీధులన్ని మారుమోగుతున్నాయి.విజ్ఞాలను తొలగించే బొజ్జ గణపయ్యను వివిధ రూపాలు, భంగిమలలో మండపాలలో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టికెఆర్ స్కూల్ వద్ద కొలువు దీరిన వినాయకుని వద్ద లడ్డును కలశం రూపంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వినాయకుని మండపాల వద్ద నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ కాంతులు ఏర్పాటు చేశారు.