మద్దికేర మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులుvఎదుర్కొంటున్నారని వీడియోల ద్వారా తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. సెల్ఫీ వీడియో సోమవారం వైరల్. యోగా చేయించడం లేదని, అన్నంలోపురుగులు వస్తున్నాయని, ఉదయం ఇడ్లీలు, సాయంత్రంస్నాక్స్ పెడుతున్నారని, బాత్రూంకు తాళం వేయడంతోఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు.ప్రిన్సిపాల్ ఉదయం 3 గంటలకు నిద్రలేపి, అసభ్యకరంగామాట్లాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థినుల తల్లిదండ్రులువెంటనే జిల్లా ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ను సస్పెండ్చేయాలని కోరారు.