ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామున ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నల్లగొండ, సూర్యాపేట యాదాద్రి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.