భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టం అని ఏటూరునాగారం తాసిల్దార్ జగదీశ్వర్ అన్నారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోహిరు, శంకరాజుపల్లి గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. తాసిల్దార్ మాట్లాడుతూ.. చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని స్పష్టం చేశారు.