శ్రీకాళహస్తిలో రేపటి నుంచే రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ శ్రీకాళహస్తిలో సోమవారం నుంచి రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ఆదివారం ఉదయం తెలిపారు. శ్రీకాళహస్తిలో సుమారు 11 వేల స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. 5 రోజులు పాటు ప్రజల ఇళ్ల వద్దకే వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది వచ్చి అందజేస్తారన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి వద్ద ఉండి ఈ-కేవైసీ చేసి తీసుకోవాలన్నారు. అభ్యంతరాలు ఉంటే MRO దృష్టికి తీసుకురావాలని కోరారు.