కడెం,ఖానాపూర్ మండలాలలో యూరియా కోసం రైతులు వ్యవసాయ సహకార సంఘాల ముందు బారులు తీరుతున్న యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఖానాపూర్ వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు మాట్లాడారు గత 4 రోజులుగా యూరియా కోసం పిఎసిఎస్,వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క యూరియా అందక వరి ఎదుగుదలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడ యూరియా సప్లై చేయాలని కోరుతున్నారు.