కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం దుర్మార్గమని వైఎస్ఆర్సిపి దివ్యాంగుల విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు బొక్కా అగస్టీన్ మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని బృందావన్ గార్డెన్స్ లోగల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అగస్టీన్ మాట్లాడారు వైసిపి పాలనలో ఇంటి వద్దకే వాలంటీర్స్ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను తొలగించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగమనడం దుర్మార్గమన్నారు.