సారంగాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మద్యం మత్తులో యువకుడు గొడ్డలితో హల్చల్ చేశాడు. శనివారం సాయంత్రం మండలంలోని జామ్ గ్రామానికి చెందిన ఆకుల శివ అనే యువకుడు మద్యం మత్తులో చేతిలో గొడ్డలితో రోడ్డుపై తిప్పుతూ వచ్చి పోయే ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు వ్యక్తిని పట్టుకొని స్టేషన్ కు తరలించారు.