రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు, ఓం శాంతి నగర్ పరిసర ప్రాంతాలలో శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ రవి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలో ఎక్కడా చెత్త, మురుగు నిల్వ లేకుండా పరిశుభ్రతా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వార్డ్‌లో శానిటేషన్ పనులను మరింత బలోపేతం చేయాలని, స్థానికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.