రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అంజిబాబు అన్నారు. బుధవారం ఆలూరు జ్యోతి భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులకు అండగా నిలిచిన ప్రభాకర్ రెడ్డిని అసభ్య పదజాలం వాడటం శోచనీయమని పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితువు పలికారు.