పల్నాడు జిల్లా,సత్తెనపల్లి మండలం కొమ్మెరపూడి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఉద్యోగులు తాళాలు వేశారు.సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న నలుగురు కాంట్రాక్ట్ షిఫ్ట్ ఆపరేటర్లను విద్యుత్ అధికారులు విధులనుంచి తొలగించారు.ఏ కారణం లేకుండా విధుల నుంచి తొలగించారంటూ గురువారం సబ్ స్టేషన్ కు ఉద్యోగులు తాళాలు వేసి పురుగుమందు డబ్బాలతో సబ్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో నిరసనకారులకు,పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.