కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు.