రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా,మండల, గ్రామాల పేర్లు, అలాగే వాటి సరిహద్దులు మార్పు కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి ఈనెల 29న రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తులను స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాకు సంబంధించి కర్నూలు సునయన ఆడిటోరియంలో 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ లు ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుండి అభ్యర్థనలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారని జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.