పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని అనుపాలెం గ్రామం సాగర్ కాలువ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మాచర్ల ఆర్టీసీ బస్సు మరియు ఓ లారీ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న సమయంలో ఒక్కసారిగా లారీ సాగర కాలువ అంచుకు వెళ్లిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా కాలవలో పడకుండా లారీని ఆపివేశాడు. పెను ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ క్లీనర్ తప్పించుకోవడం జరిగింది.