ఏలూరు జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం సాయంత్రం ద్వారకాతిరుమలలో స్థానిక బంగారుతల్లి కళ్యాణ మండపంలో రాష్ట్రనాయకులు సమక్షంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫోటోగ్రాఫర్స్ చైర్మన్ మాదాల రమేష్, రాష్ట్ర అధ్యక్షులు మెట్ట నాగరాజు, రాష్ట్ర సెక్రటరీ మోహన్ రావు. పాల్గొని నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేయించారు. ఈమేరకు అధ్యక్షులుగా ఏలూరుకు చెందిన కేవి రమణారావు, కార్యదర్శిగా ఎస్ ప్రదీప్ కుమార్, కోశాధికారిగా పుల్లాభట్ల రామ్మూర్తి,అదేవిధంగా వై సూరిబాబు, ఎస్డీ అంజాద్, జే సిద్ధయ్య, పిల్లి బ్రాహ్మరావు, ప్రమాణస్వీకారం చేసారు.