రైతు పోరు ర్యాలీని విజయవంతం చేయండి : నూకతోటి రైతులకు ఎరువుల కోతపై ఈనెల 9న అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేశ్ తెలిపారు. కేవీబీ పురంలో వైసీపీ నేతలతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఏడు మండలాల నాయకులు 9వ తేదీ శ్రీకాళహస్తిలో జరుగు భారీ ర్యాలీలో పాల్గొనాలన్నారు. శ్రీకాళహస్తి ఆర్డిఓ కార్యాలయం ఎదుట జరుగు నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.