గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 8నెలల వేతనాలను చెల్లించాలని సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంటలో విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నెలలుగా వేతనాలు లేకపోతే పారిశుధ్య కార్మిక కుటుంబాలు ఎలా బ్రతుకుతాయని ప్రశ్నించారు. ఈ విషయమై తక్షణమే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికులు ఆందోళన బాట పడతారని స్పష్టం చేశారు.