ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు తలమర్ల మధ్య రైల్వే పట్టాల కింద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది రైలు పట్టాల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దీంతో పలు రైల్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. కాచిగూడ నుండి బోధన్ వెళుతున్న ప్యాసింజర్ రైలు బిక్కనూర్ రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు నిలిపివేశారు.