Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: రేకుర్తిలో వినాయక విగ్రహ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు

Karimnagar, Karimnagar | Aug 30, 2025
కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో నెలకొల్పిన వినాయక విగ్రహ పూజలో శనివారం రాత్రి ముస్లిం కుటుంబం పాల్గొని పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రాంతంలో నివసించే సైఫ్, సన దంపతులు ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు వినాయక మండపంలో సైఫ్ ఆయన సతీమణి సన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి సొంత ఖర్చులతోనే పూజా సామాగ్రి తీసుకవచ్చి కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా మతసామరస్యానికి ప్రతీకగా తాను భావించి ఈ పూజ కార్యక్రమంలో తన కుటుంబ సమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు సైఫ్ తెలిపారు. రేకుర్తి ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబం వినాయక పూజలో పాల్గొనడం ఇదే ప్రధమమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us