శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 240 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు అలసత్వం చూపరాదని కలెక్టర్ ఆదేశించారు. పుట్టపర్తి 63, పెనుకొండ 83, ధర్మవరం 52, కదిరి 42 మొత్తం 240 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.