శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆంజనేయులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ లు మంగళవారం దర్శించుకుని ప్రత్యేకంగా స్వామి వారికి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పోలవరం గోదావరి పెన్నా నదుల అనుసంధానం బనకచర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తామని అన్నారు.