Parvathipuram, Parvathipuram Manyam | May 23, 2025
పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ భవన్ గౌరేశ్వరి తీరును పార్వతీపురం ఎమ్మెల్యే బోనిల విజయ్ చంద్ర ఆక్షేపించారు. శుక్రవారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సమావేశంలో అమ్మవారి పండుగకు సంబంధించి పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సమస్యలు పరిష్కారానికి నిర్వహించాల్సిన సమావేశం బహిష్కరించి చైర్పర్సన్ వెళ్లిపోవడం వింతగా ఉందన్నారు. బడ్జెట్ సమావేశాన్ని మాత్రమే నిర్వహిస్తామని, సాధారణ సమావేశం నిర్వహించిందని అనటం సరికాదన్నారు. చైర్ పర్సన్ తీరు ప్రజా వ్యతిరేకంగా ఉందన్నారు.