తిర్యాణి బ్లాక్ లో అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు,కళాశాలలో మౌలిక వసతుల కల్పన కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిర్యాణి బ్లాక్ లో చేపట్టిన చర్యలలో భాగంగా అంగన్వాడీ, పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక వసతులు, త్రాగునీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్, బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు నిర్మాణం అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.