మోపిదేవి లో ఎరువుల దుకాణాలను వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు యూరియా స్టాక్ వివరాలు, రైతులకు ఎంత ధరకు అమ్ముతున్నారనే వివరాలు తెలుసుకున్నారు. యూరియా కొంటే మరొకటి కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టవద్దని సూచించారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఏవో హెప్సిబారాణి, ఎస్సై సత్యనారాయణ, ఆర్ ఐ ఉన్నారు.