కోటమీ ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సోమవారం కోడుమూరు పట్టణంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పీఎం, సీఎం చిత్రపటాలకు మహిళలతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.