కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం ముద్దనూరు గ్రామపంచాయతీ లో గల ఎస్డబ్ల్యుపిసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఎస్బియం స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అయినందున మంగళవారం సెంట్రల్ టీం మెంబెర్ ప్రసాద్ తనిఖీకి వచ్చినారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రములో తయారైన వర్మి కంపోస్ట్ ను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానంపై మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన మిషనరీ లను, పని చేయించు విషయంపై పలు విలువైన సూచనలు సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పరిపూర్ణ అరుంధతి,యంఆర్సి కరీమునిసా, తదితరులు పాల్గొన్నారు.