గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం విజయవాడ మొగల్రాజపురం, క్రీస్తు రాజపురం, భవానిపురం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మ్యాన్ హోల్ లో నుంచి వస్తున్న డ్రైనేజీ వాటర్ ను తక్షణమే ట్యాంకుల ద్వారా బయటకు తరలించాలని ఆదేశాలు తెలిపారు. ఎప్పటికప్పుడు రోడ్లపై వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని అధికారులకు తెలిపారు ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.