ఈనెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా చిత్తూరు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కట్టమంచి వివేకానంద సాగర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి చేపట్టారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయక చవితి జరుపుకోవాలన్నారు. ఎవరుగాని పర్యావరణానికి హాని కలిగించేలా చేయరాదని కోరారు. చిత్తూరు కట్టమంచి చెరువు లో ఏర్పాటుచేసిన నిమజ్జనం ప్రాంతంలోనే ప్రతి ఒక్కరు నాయకులు నిమజ్జనం