దేవరకద్ర మండల కేంద్రంలో మంగళవారం రాత్రి 7 గంటలకు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ జనవాహిని ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు.స్థానిక ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలిస్ పఠనం చేశారు.అనంతరం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి పురవీధుల గుండా కాషాయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో జైశ్రీరామ్ అంటూ పట్టణ పురవీధులు మారిమోగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండ ప్రశాంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి కృష్ణంరాజు తిప్పారెడ్డి వేణుగోపాల్ రెడ్డి దేవన్నసాగర్ జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ తదితరులు ఉన్నారు.